తెలంగాణ

telangana

ETV Bharat / state

చారిత్రక కట్టడాల అభివృద్ధిపై కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం - High Court directed ts government

High Court directed ts government to set up a committee on the development of historic monuments
చారిత్రక కట్టడాల అభివృద్ధిపై కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం

By

Published : Apr 15, 2021, 12:22 PM IST

Updated : Apr 15, 2021, 1:05 PM IST

12:13 April 15

చారిత్రక కట్టడాల అభివృద్ధిపై కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం

చారిత్రక కట్టడాల అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు చేసి, ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 22లోగా కమిటీ తొలి భేటీ జరగాలని... చారిత్రక కట్టడాల అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. గోల్కొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్ దెబ్బతిన్నాయన్న కథనాలపై విచారణ జరిపిన ధర్మాసనం... ఈ నెల 12న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో 27 చారిత్రక కట్టడాలు ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గోల్కొండ పరిసరాల్లో 151 అక్రమ నిర్మాణాలున్నాయని... పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులు, విద్యుత్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో ఉండాలన్న హైకోర్టు... కమిటీ సమావేశాలు, నిర్ణయాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని పురావస్తుశాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ... తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.

Last Updated : Apr 15, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details