తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్దిష్ట గడువులోగా ప్రజల వినతులపై స్పందించాలి: హైకోర్టు - తెలంగాణ వార్తలు

ప్రజలు ఇస్తున్న వినతి పత్రాలపై అధికార యంత్రాంగం సత్వరం స్పందించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యే వరకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high-court-directed-to-government-on-public-petitions
నిర్దిష్ట గడువులోగా ప్రజల వినతులపై స్పందించాలి: హైకోర్టు

By

Published : Feb 10, 2021, 7:56 AM IST

ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇస్తున్న వినతి పత్రాలపై అధికార యంత్రాంగం సత్వరం స్పందించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వినతి పత్రాల అమలుకూ కోర్టును ఆశ్రయిస్తున్నారని, ఇలాంటి పిటిషన్లపై ప్రాథమిక దశలోనే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

కోర్టు ఆశించినట్లుగా అధికారులు వినతి పత్రాలు, ఫిర్యాదులను పరిష్కరించడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యాక చర్యలు చేపడుతున్నారంది. ఇవి కోర్టులకు భారంగా మారుతున్నాయని.. అందువల్ల నిర్దిష్ట గడువులోగా అధికార యంత్రాంగం ఫిర్యాదులను పరిష్కారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

ఇదీ చదవండి:ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా హరితహారం.. ఆరేళ్లలో 210 కోట్ల మొక్కలు

ABOUT THE AUTHOR

...view details