రేషన్ వాహనాల రంగులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను పరిశీలించి.. వాటి రంగులు మార్చాలని అధికారులకు తెలిపామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.
రేషన్ వాహనాల రంగులపై.. తీర్పు రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు - రేషన్ వాహనాల రంగులపై హైకోర్టులో ఈరోజు విచారణ
పలు పార్టీలు రేషన్ వాహనాల రంగులపై అభ్యంతరాలు తెలిపాయని ఎస్ఈసీ తరపు న్యాయవాది ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వేసిన పిటిషన్.. న్యాయస్థానంలో ఈరోజు విచారణకు వచ్చింది. తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది.
రేషన్ వాహనాల రంగులపై.. తీర్పు రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు
వాహనాల రంగులపై పలు పార్టీలు ఫిర్యాదులు చేశాయన్నారు. వాటిపై ప్రస్తుతం వేరే రంగులు ఉన్నా.. వైకాపా జెండా రంగులే అధికంగా ఉన్నాయని చెప్పారు. పథకం నిలువరిస్తామని తాము చెప్పలేదని.. రంగులు మార్చితే అనుమతిస్తామని తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ఇదీ చూడండి:'తెలంగాణపై అవగాహన లేని వారు వచ్చి విమర్శలు చేస్తున్నారు'