తెలంగాణ

telangana

ETV Bharat / state

కోర్టులో భౌతిక విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం!

కరోనా వైరస్​ కారణంగా కోర్టుల్లో భౌతిక విచారణను కొంతకాలం పాటు వాయిదా వేసిన హైకోర్టు..  తిరిగి సెప్టెంబర్​ 7 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. ముఖ్యమైన కేసులను పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు ధర్మాసనం పేర్కొంది.

High Court Comments On Courts Hearing
కోర్టులో భౌతిక విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం!

By

Published : Aug 20, 2020, 7:46 PM IST

కరోనా వైరస్​ కారణంగా నాలుగు నెలలుగా భౌతిక విచారణను తగ్గించిన హైకోర్టు సెప్టెంబర్​ 7 నుంచి తిరిగి పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ చేపట్టాలని పేర్కొంది. అగ్రిగోల్డ్​, అక్షయ గోల్డ్​ కేసులను అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆర్​ఎస్​ చౌహన్​, బి.విజయ్​సేన్​ రెడ్డిల ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ల అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం సెప్టెంబర్​ 7 నుంచి పరిమితంగా భౌతిక విచారణలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాలను ఇప్పుడు అత్యవసరంగా తేల్చాల్సిన అవసరం లేదని.. అలాంటి పిటిషన్లు కోర్టులు పూర్తిగా తెరిచిన తర్వాత విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. అత్యవసర కేసులు మాత్రం పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ జరపాలని నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details