తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాఫిక్ హోంగార్డును అభినందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - హైదరాబాద్ తాజా వార్తలు

ట్రాఫిక్ హోంగార్డు అష్రఫ్ అలీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మకు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధులను అష్రఫ్ నిర్వహిస్తున్నారు. విధుల పట్ల నిబద్ధత మెచ్చుకొని హోంగార్డుకు పుష్పగుచ్ఛం అందించి సీజే అభినందించారు.

Justice  Satish Chandra Sharma
జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ

By

Published : Apr 8, 2022, 12:37 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ ట్రాఫిక్‌ హోంగార్డును అభినందించారు .హైదరాబాద్‌ అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రఫ్‌ ఆలీ బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం అదే దారివెంట రాకపోకలు సాగిస్తున్న ప్రధాన న్యాయమూర్తి హోంగార్డు అష్రఫ్‌ ఆలీ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడాన్ని గమనించారు.

ఉదయం హైకోర్టుకు వెళ్లే సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ కారు నిలిపి హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

ఇదీ చదవండి:HUGE BOUQUET: లిమ్కా బుక్‌ రికార్డ్స్‌ కోసం.. భారీ పుష్ప గుచ్ఛం

ABOUT THE AUTHOR

...view details