తెలంగాణ

telangana

ETV Bharat / state

డైరీ ఆవిష్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి - హైదరాబాద్​ తాజా వార్తలు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి హైదరాబాద్​లో న్యాయ శాఖ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని న్యాయ శాఖ ఉద్యోగులు.. సీజేని కోరారు.

high court chief justice hima kohli release dairy in hyderabad
డైరీ ఆవిష్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి

By

Published : Jan 31, 2021, 4:16 AM IST

న్యాయ శాఖ ఉద్యోగుల డైరీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆవిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని న్యాయ శాఖ ఉద్యోగులు.. సీజేని కోరారు. కొన్ని న్యాయస్థానాల్లో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

సిబ్బంది సంఖ్య ఒక్కో కోర్టులో ఒక్కో విధంగా ఉందని.. అన్ని న్యాయస్థానాల్లో ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ శాఖలో 525 ఉద్యోగాల మంజూరుకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద పెండింగ్​లో ఉందని.. త్వరగా ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని సీజేని ఉద్యోగులు కోరారు.

ఇదీ చదవండి:ఆపరేషన్ స్మైల్​... రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 3,178 పిల్లలు సేఫ్​

ABOUT THE AUTHOR

...view details