తెలంగాణ

telangana

ETV Bharat / state

high court on revenue issues:' కేసులు పెరుగుతున్నాయి.. త్వరగా ఓ నిర్ణయం తీసుకోండి'

high court on revenue issues: రెవెన్యూ శాఖలో కేసుల పరిష్కరానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్ల నుంచి వచ్చే కేసుల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

high court on revenue issues
రెవెన్యూ కేసులపై హైకోర్టు

By

Published : Jan 20, 2022, 5:27 AM IST

high court on revenue issues: ప్రభుత్వం ధరణి పోర్టల్ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్ల నుంచి వచ్చే కేసుల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ కేసుల పరిష్కారానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సింగిల్‌ విండో పద్ధతి పెట్టడంతో ఈ కోర్టుపై రోజుకు 200 నుంచి 300 కేసులు వచ్చి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో అందరూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయశాఖకు చెప్పాలని సూచించింది. లేని పక్షంలో మేమే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని పేర్కొంది. మున్సిపల్‌ వివాదానికి సంబంధించి ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అడ్వొకేట్‌ జనరల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. దీనిపై ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ స్పందిస్తూ రెవెన్యూ వివాదాలకు పరిష్కార మార్గాలున్నాయని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details