బోధన సిబ్బంది నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఇఫ్లూకి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇంటర్వ్యూల ప్రక్రియ నిలిపివేస్తూ ఆదేశిస్తూ జనవరి 21న జాతీయ బీసీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలు వెల్లడించవద్దని ఉన్నత న్యాయస్థానం షరతు విధించింది. ఇఫ్లూలో 58 మంది బోధన సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధనను పాటించకపోవడం రాజ్యాంగ విరుద్దమంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ బీసీ కమిషన్ ఇంటర్వ్యూల ప్రక్రియను నిలిపివేస్తూ జనవరి 21న ఉత్తర్వులు జారీ చేసింది.
బోధన సిబ్బంది నియామకం కోసం ఇఫ్లూకు హైకోర్టు అనుమతి - telangana varthalu
ఇఫ్లూలో ఇంటర్వ్యూల ప్రక్రియ నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. బోధన సిబ్బంది నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఇఫ్లూకి ఉన్నత న్యాయస్థానానికి అనుమతిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలు వెల్లడించవద్దని ఉన్నత న్యాయస్థానం షరతు విధించింది.
బోధన సిబ్బంది నియామకం కోసం ఇఫ్లూకు హైకోర్టు అనుమతి
జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇఫ్లూ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. స్టే ఇచ్చే అధికారం బీసీ కమిషన్‌కు లేదని ఇఫ్లూ తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ను, దాసోజు శ్రావణ్‌ను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: కేటీఆర్