తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర' కేసు విచారణ సోమవారానికి వాయిదా - High Court Latest News

MLAs poaching case
MLAs poaching case

By

Published : Nov 4, 2022, 1:18 PM IST

Updated : Nov 4, 2022, 2:59 PM IST

13:03 November 04

'ఎమ్మెల్యేల ఎర' కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనాలు

TRS MLAs poaching case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. నిందితులకు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టులో జరిగే విచారణ ట్రయల్ కోర్టుపై ప్రభావం చూపదని ధర్మాసనం వెల్లడించింది. ఇక ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగింది.

ఈ కేసులో విచారణను హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు దర్యాప్తుపై స్టే కొనసాగుతుందని పేర్కొంది. భాజపాతోపాటు.. నిందితుడు నందు భార్య చిత్రలేఖ, ఇతర పిటిషన్లను కలిపి హైకోర్టు.. సోమవారం విచారించనుంది. కేసును సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ భాజపా నేత ప్రేమేందర్‌ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతవారం.. ఆ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేసేంతవరకు మెయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై స్టే విధించింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు నిన్న కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ సుదీర్ఘంగా ఉన్నందున వాదనకు సమయమివ్వామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా సోమవారానికి విచారణ వాయిదావేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని నిందితుల కస్టడీపిటీషన్ వేసేందుకు అనుమతించాలని అడ్వకేట్ జరనల్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. పిటీషన్‌లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని.. తీన్మార్‌ మల్లన్న కోరారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తును ప్రభావితంచేసేలా సీఎం కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని మల్లన్న తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వాదనలు సోమవారం హైకోర్టులో జరగనున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details