తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్‌లో ఎక్కువ కరోనా కేసులు ఉండటం ఆందోళనకరం' - తెలంగాణలో లాక్‌డౌన్‌

high-court
high-court

By

Published : Apr 17, 2020, 5:07 PM IST

Updated : Apr 17, 2020, 7:13 PM IST

17:03 April 17

'హైదరాబాద్‌లో ఎక్కువ కరోనా కేసులు ఉండటం ఆందోళనకరం'

హాట్ స్పాట్లలో నివసిస్తున్న వారందరికీ కరోనా పరీక్షలు ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఎలా ఉంది.. పరీక్ష కిట్లు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సర్కారును ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత పరీక్షలు, చికిత్సలు జరిపేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తిరుమలరావు అనే న్యాయవాది లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.  

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సలు జరపవద్దని ఆదేశాలున్నందున.. ప్రభుత్వాస్పత్రులకే పంపుతున్నట్లు తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, హాట్ స్పాట్లు ఉండటం ఆందోళన కలిగిస్తోందని ధర్మాసనం పేర్కొంది. కరోనా పరీక్షలు చేసేందుకు ఆరు లక్షల కిట్లు కొనుగోలు చేసేందుకు ఆర్డరిచ్చినప్పటికీ... ప్రస్తుతం 60వేలే ఉన్నట్లు నివేదికలో ప్రభుత్వం వివరించిన అంశాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

హాట్ స్పాట్లలో ఉంటున్న వారికి పరీక్షలు ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది..  బాధితుల సంఖ్య ఎలా పెరుగుతోంది.. ఎన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయి తదితర పూర్తి వివరాలతో ఈనెల 24లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Last Updated : Apr 17, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details