High Command To solve T Congress Dispute : రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. పార్టీ అధిష్ఠానం చర్యలు వేగవంతం చేసింది. పీసీసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశంపై మాట్లాడేందుకు... ముగ్గురు ఏఐసీసీ ఇంఛార్జ్‌లను అధిష్ఠానం దిల్లీకి పిలిపించింది. పీసీసీకి వ్యతిరేక వర్గం ఎందుకు ఏర్పడిందనే విషయంపై.. దిగ్విజయ్‌సింగ్, కేసీ వేణుగోపాల్ ఆరా తీయనున్నారు. మరోవైపు ఇవాళ లేదా రేపు దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌కు వచ్చి.. అసంతృప్త నేతలతో భేటీ కానున్నారు.
పీసీసీ కమిటీ ప్రకటనతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు ముమ్మరం చేసింది. పీసీసీ కమిటీ ఏర్పాటు అనంతరం.. వలసవాదులకు పదవులు దక్కాయని.. జెండా మోసిన వాళ్లకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. ఈ విషయంపై పీసీసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోసారి నిన్న భేటీ కానుండగా సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సూచనతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
ఈ పరిస్థితుల్లో పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు.. ముగ్గురు ఏఐసీసీ నేతలను అధిష్ఠానం దిల్లీకి పిలిచింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కేసీ వేణుగోపాల్.. వీరితో భేటీ కానున్నారు. పీసీసీకి వ్యతిరేక వర్గం ఎందుకు ఏర్పడింది? పీసీసీని సీనియర్ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారనే అంశంపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితులపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ , ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావీద్, రోహిత్ చౌదరిలు.. దిగ్విజయసింగ్ , కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యే అవకాశముంది.
ఇవాళ లేదా రేపు హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్:ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా.. నేతలకు పలు సూచనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ లేదా రేపు దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలతో దిగ్విజయ్ సమావేశం కానున్నారు. పార్టీలో పరిస్థితులు, వ్యతిరేకించడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీయనున్నారు. పీసీసీ పార్టీ పదవులకు రాజీనామా చేసిన 12 మంది నేతలతోనూ.. దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యే అవకాశముంది.
ఇవీ చదవండి:అధిష్ఠానం హామీ.. కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలిక తెర
మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన