తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 6:07 AM IST

Updated : Mar 22, 2020, 6:51 AM IST

ETV Bharat / state

నిత్యావసర సరుకుల కోసం బారులు తీరిన జనం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దుష్ప్రభావంతో రాష్ట్రం హై అలర్ట్ ప్రకటించింది. ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కోసం జనం బారులు తీరారు.

కిరాణా సరకుల కోసం బారులు తీరిన నగర వాసులు
కిరాణా సరకుల కోసం బారులు తీరిన నగర వాసులు

ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. హైదరాబాద్​లో నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద నగర ప్రజలు బారులు తీరుతున్నారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని కోరారు.

కిరాణా సరకుల కోసం బారులు తీరిన నగర వాసులు

శానిటేషన్​ చేశాకే...

నగరంలోని పలు దుకాణాలకు జనాలు ఎక్కువగా రావడం వల్ల కొందరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. శానిటేషన్​తో చేతులు శుభ్రం చేశాకే లోపలికి పంపుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తరలివస్తున్నారు. వైన్ షాప్​ల వద్ద కూడా జనాలు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేపట్టారు.

ఇవీ చూడండి : ప్రపంచవ్యాప్తంగా 12వేలకు చేరువలో కరోనా మరణాలు

Last Updated : Mar 22, 2020, 6:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details