హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రోరైల్ ఈనెల 29న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం హైటెక్ సిటీ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉండేది. రాయదుర్గం వరకు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ కారిడార్‌లో కొద్దిరోజుల క్రితమే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మెట్రోకు మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
అందుబాటులోకి రానున్న హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రో - Hi-Tech City - Rayadurg Metro news
హైదరాబాద్ నగర ప్రజలకు హైటెక్‌సిటీ- రాయదుర్గం మెట్రోరైల్ ఈనెల 29న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.
హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రో