వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. తీవ్ర అల్పపీడనం...అల్పపీడనంగా మారిందని వచ్చే 48గంటల్లో బలహీనమై వర్షాలు తగ్గుముఖం పడుతాయన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాపాతం ఎక్కువగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ సీజన్ లో ఇప్పటికే సాధారణం కన్నా 31శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించింది.
జిల్లా | సాధారణం కన్నా వర్షం పెరుగుదల శాతం |
వనపర్తి | 124 |
జోగులాంబ గద్వాల | 111 |
నిర్మల్ | -23 |
వరంగల్ అర్బన్ | 108 |