వర్ధమాన సినీనటి రాశీసింగ్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాశీసింగ్‌తో పాటు మిస్ యూనివర్శ్ ఇండియా అర్చన, నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొన్నారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విభిన్న రకాల స్టాల్స్‌ను సందర్శించారు. కెమెరాకు పోజులిస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు.
వస్త్రాభరణాల ప్రదర్శనలో సినీనటి రాశీసింగ్ సందడి - heroine rashi singh inaugurated costumes and jewellery exhibition
బంజారాహిల్స్‌లో ఓ వస్త్రాభరణాల ప్రదర్శనను సినీనటి రాశీసింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.
సినీనటి రాశీసింగ్, తాజ్ డెక్కన్‌లో వస్త్రాభరణాల ప్రదర్శన
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దాదాపు 300 మంది డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాలు, డిజైనర్ వేర్, సాంప్రదాయ కంచిపట్టు చీరలు ఇలా మగువలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాభరణాలను అందిస్తున్నట్లు వివరించారు.