కామాటీపురకు చెందిన ఇసాక్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. సినిమాల్లో నటించాలనే కోరికతో నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ముంబయి వెళ్లాడు. అవకాశాలు దక్కని క్రమంలో పబ్‌లో పని చేశాడు. అక్కడ మాదకద్రవ్యాలకు అలవాటు పడి డ్రగ్స్ ముఠాతో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లో విక్రయించేందుకు హెరాయిన్ తీసుకొని నగరానికి వచ్చాడు.
కథని కంచెకి చేర్చిన 'సినిమా'
పాతబస్తీకి చెందిన ఓ యువకుడు సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబయికి వెళ్లి మాదకద్రవ్యాలు సరఫరా చేసే స్మగ్లర్‌గా మారాడు. డ్రగ్స్ అమ్మే ముఠాతో జతకట్టి వాటిని హైదరాబాద్‌లో విక్రయిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఇసాక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠా గురించి వివరాలు సేకరించారు. 8 మంది సభ్యులున్న అంతరాష్ట్ర ముఠాలో నిందితుడితో కలిపి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 28 గ్రాముల హెరాయిన్, 5 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. గ్రాము విలువ రూ.11వేలు ఉంటుందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నగరంలో ఈ ముఠా ఎవరెవరికి హెరాయిన్ విక్రయించిందనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: మేడ్చల్‌లో పథకం ప్రకారం యువకుడి హత్య