తెలంగాణ

telangana

ETV Bharat / state

'పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి' - sai pallavi speech on she safe app

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మహిళా సాధికారత సదస్సులో సినీ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. 'షీ సేఫ్' యాప్​ను ఆమె ప్రారంభించారు. మహిళల కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

heroin sai pallavi lunches the she safe app
'షీ సేఫ్' యాప్​ను ప్రారంభించిన హీరోయిన్ సాయిపల్లవి

By

Published : Feb 20, 2020, 12:55 PM IST

Updated : Feb 20, 2020, 2:40 PM IST

పిల్లలకు చిన్నతనం నుంచి మంచి, చెడు ఏంటో నేర్పించాలని సినీనటి విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా నడుచుకోవడం మన కనీస బాధ్యతని గుర్తుచేశారు. అందరి భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మహిళా సాధికారత సదస్సులో సాయి పల్లవి పాల్గొన్నారు. 'షీ సేఫ్' యాప్​ను ఆమె ప్రారంభించారు.

తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు..

మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్​లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని పేర్కొన్నారు. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే మహిళలు యువతులు గతంలో చాలా భయపడే వారని, ప్రస్తుతం సిటీ పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారని తెలిపారు.

'పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి'

ఇవీ చూడండి:మహిళల భద్రతే ప్రథమ లక్ష్యం: సజ్జనార్

Last Updated : Feb 20, 2020, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details