స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని "ది దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో "ది వ్యూచర్ ఆఫ్ స్కిల్లింగ్ " పేరుతో ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తోపాటు టీసీఎస్ ప్రాంతీయ కార్యాలయ హెచ్ఆర్ హెడ్ శ్రీకాంత్, డబ్యూడీసీ ఇండియా హెచ్ఆర్ హెడ్ డాక్టర్ కిరణ్మయి, టెక్ మహేందర్ హెచ్ఆర్ ఉపాధ్యక్షుడు వినయ్ అగర్వాల్ పాల్గొన్నారు.
'ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు కల్పించాలి' - Hero Vijay Devarakonda wants to create jobs
నేటి తరం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకకపోతే వారిలో సమాజం పట్ల వ్యతిరేక భావన కలిగే అవకాశముందని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. అలాంటి ప్రవర్తన యువతలో రానివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వాలు యువతకు ఉపాధిని సృష్టించుకునేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ వెబినార్ నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ పేర్కొన్నారు.
ఈ వెబ్నార్లో యువత నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై గంటకుపైగా చర్చించారు. ఈ చర్చలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. మన జీవితాలను నిలబెట్టుకొనే శక్తి మన చేతుల్లోనే ఉందని సూచించారు. ఏ వృత్తిలో రాణించాలనుకుంటే ఆ వృత్తిపై మమకారం పెంచుకుని పట్టుదలతో కృషి చేయాలని కోరారు. తన ఫౌండేషన్, నిర్మాణ సంస్థతోపాటు రౌడీ వేర్లో సుమారు 50 మందికిపైగా ఉపాధి కల్పించినట్లు పేర్కొన్న విజయ్.. విద్య, ఉపాధితోపాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తాను పనిచేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :"నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"