లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బృందం పోలీసులకు మరియు సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఉచిత సానిటైజర్లు, మాస్కులు అందజేశారు.
పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన హీరో శ్రీకాంత్
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న పోలీసులకు హీరో శ్రీకాంత్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు.
పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన హీరో శ్రీకాంత్
లాక్డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర చౌదరి, నటుడు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'
Last Updated : Apr 21, 2020, 11:38 PM IST