కారు ప్రమాదం వల్ల తనవారెవరో తెలిసిందని సినీనటుడు రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంతో మంది తన యోగక్షేమాలు తెలుసుకొని ఇంటికి రావడం ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్న రాజశేఖర్... క్షణాల్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు వివరించారు. కారు పల్టీలు కొట్టడం వల్ల ముఖంపై చిన్న గాయం అయిందని రాజశేఖర్ తెలిరారు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు రాజశేఖర్ కారు ప్రమాదంపై వస్తున్న వార్తలను జీవిత రాజశేఖర్ ఖండించారు. కారు ప్రమాదంపై నార్సింగి పోలీసులకు సమగ్ర వివరణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
కారు ప్రమాదం వల్లే నా వారెవరో తెలిసింది: రాజశేఖర్ - hero Rajashekhar revealed about car accident
తాను క్షణాల్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు... ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు సినీనటుడు రాజశేఖర్ వీడియో విడుదల చేశారు. కారు ప్రమాదం వల్ల తనవారెవరో తెలిసిందన్నారు.
కారు ప్రమాదం వల్ల నా వారెవరో తెలిసింది: రాజశేఖర్