తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ను వివాహానికి ఆహ్వానించిన నితిన్​ - నితిన్​ పెళ్లి తాజా వార్తలు

యువ హీరో నితిన్.. తన వివాహానికి సీఎం కేసీఆర్​ను ఆహ్వానించారు. ఈ నెల 26న జరగనున్న తన పెళ్లి వేడుకకు రావాల్సిందిగా కోరారు. ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తన ప్రేయసి శాలిని మెడలో నితిన్ మూడుముళ్లు వేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్​కు నితిన్​ వివాహ ఆహ్వానం
సీఎం కేసీఆర్​కు నితిన్​ వివాహ ఆహ్వానం

By

Published : Jul 20, 2020, 6:42 PM IST

సీఎం కేసీఆర్​కు నితిన్​ వివాహ ఆహ్వానం

యువ కథానాయకుడు నితిన్.. తన వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్​కు వెళ్లిన నితిన్.. సీఎం కేసీఆర్​ను కలిశారు. ముఖ్యమంత్రికి తన వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 26న జరగనున్న తన వివాహానికి రావాల్సిందిగా కోరారు.

అయితే ఈ నెల 26న హైదరాబాద్​లోనే తన పెళ్లి జరగబోతున్నట్లు నితిన్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తన ప్రేయసి శాలిని మెడలో నితిన్ మూడుముళ్లు వేయనున్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆకాంక్షించిన ఈ హీరో.. కరోనా వైరస్ కారణంగా తన వివాహన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్​లోనే కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకునేందుకు నితిన్ సిద్ధమయ్యారు.

ఇది చదవండి:యువహీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారు

ABOUT THE AUTHOR

...view details