Nandamuri Balakrishna Pongal Celebrations: చెడును అంతం చేసి మంచి వైపు మన ప్రయాణమే సంక్రాంతి అని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి పురందేశ్వరి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.
సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని బాలకృష్ణ అన్నారు. చెమటోడ్చి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ.. రైతులు, రైతుకూలీలు, గ్రామీణులు, మహిళలు, యువత, అందరిలో ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. క్రాంతి అంటే మార్పు.. సంక్రాంతి అంటే మంచిమార్పు అని అన్నారు.