ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన మోహన్ నేమాని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2010లో వారు కాకినాడ బీచ్‌ను సందర్శించారు. మోహన్ తన కుమారుడు ప్రణవ్, కూతురుకి బీచ్‌లో గింజాల పెదసత్తియ్య వద్ద వేరుశనక్కాయలు కొన్నారు. పర్సు మర్చిపోవడంతో అతనికి డబ్బులివ్వలేకపోయారు. అప్పుడు ప్రణవ్ అతడితో ఫొటో దిగారు. అప్పటినుంచి వారు కాకినాడ వచ్చిన ప్రతిసారీ అతని కోసం వాకబు చేసినా ఫలితం లేకపోయింది.
Gift After 12 Years: వేరుశనక్కాయలు ఫ్రీగా ఇచ్చాడని.. పన్నెండేళ్ల తర్వాత..
Help to groundnut seller family: సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ చిరువ్యాపారి దగ్గర వేరుశనక్కాయలు కొనుక్కొని డబ్బులు ఇవ్వలేదని గుర్తు పెట్టుకున్న ఒక బాలుడు.. అప్పటినుంచి అతడి కోసం ఎంతగానో వెతికాడు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకొని రూ.25 వేలు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు.
మోహన్ తన స్నేహితుడైన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆ విషయం చెప్పారు. ఎమ్మెల్యే తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రణవ్ తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. పెదసత్తియ్యకు సంబంధించిన వారుంటే సంప్రదించాలని, తన పీఏ ఫోన్‌నంబరు ఇచ్చారు. చివరికి అతని కుటుంబం జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటున్నట్లు గుర్తించారు. పెద సత్తియ్య మరణించగా, ఆయన కుటుంబసభ్యులను గురువారం కాకినాడ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి, ఎన్‌ఆర్‌ఐ మోహన్, ఆయన పిల్లలు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
ఇదీ చదవండి:Financial Planning for 2022: కొత్త ఏడాదికి ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా..!