తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన - Hrc on eenadu article

ఈనాడు దినపత్రికలో వచ్చిన ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందించింది. శ్మశానాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 25 లోపు సమగ్ర నివేదికను కమిషన్ కు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది.

hrc
hrc

By

Published : May 24, 2021, 7:34 PM IST

ఆగని ఆఖరి దోపిడీ అని ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కొవిడ్ మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రైవేట్ అంబులెన్స్ ల నుంచి శ్మశానాల నిర్వాహకుల వరకు అందరూ కరోనా మృతుల బంధువుల్ని పీక్కుతింటున్నారు. రోగిని దహనం చేయడానికి వేలల్లో రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ చర్యల్ని అరికట్టడానికి దహనానికి అయ్యే ధరల్ని నిర్ధరిస్తూ జీహెచ్ఎంసీ ఇప్పటికీ ఓ ప్రకటన ఇవ్వకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయని కథనంలో ఉంది. తక్షణమే ఈ ఘటనపై వివరణ జరిపించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 25 లోపు సమగ్ర నివేదికను కమిషన్ కు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్​ను హెచ్చార్సీ ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details