హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్‌కి వరద అధికంగా పోటెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.410 మీటర్లను దాటి 513.840 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 2,519 క్యూసెక్కులు కాగా తూముల ద్వారా 3,093 క్యూసెక్కుల జౌట్ ఫ్లో వెళుతోంది.
పూర్తి స్థాయి నీటిమట్టాన్ని దాటిన హుస్సేన్ సాగర్ వరద - హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తాజా వార్తలు
నగరంలో భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారాయి. వరద నీరు అధికంగా పోటెత్తడంతో అధికారులు నీటిని వదులుతున్నారు.
పూర్తి స్థాయి నీటిమట్టాన్ని దాటిన హుస్సేన్ సాగర్ వరద
నగర శివారులోని హిమాయత్ సాగర్ జలాశయానికి క్రమంగా వరద తగ్గుతోంది. అధికారులు 4 గేట్లు తెరిచి 5,488 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. జలాశయానికి 2,777 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.85 అడుగులకి నీరు చేరింది.
ఇదీ చదవండి:'ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేరు'