గత కొద్ది రోజులుగా హైదరాబాద్ శివారులో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 1762 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది. దీంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ అప్రమత్తం చేశారు.
హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద నీరు - హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం
హైదరాబాద్ నగర శివారులో కురిసిన వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1762 అడుగులకు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని, పోలీసులను జలమండలి ఎండీ దానకిశోర్ అప్రమత్తం చేశారు.
![హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద నీరు Heavy water flow into himayath sagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9151886-116-9151886-1602516872872.jpg)
హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద నీరు
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో హిమాయత్‌సాగర్ నీటిమట్టం 1763 అడుగుల స్థాయికి చేరితే ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఎండీ ప్రకటించారు.
హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద నీరు