తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం జలాశయంలో భారీ వరద ప్రవహాం - srisailam water latest news

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 1.60లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1.99 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 848.10 అడుగులుగా ఉంది.

శ్రీశైలం జలాశయంలో భారీ వరద ప్రవహాం
శ్రీశైలం జలాశయంలో భారీ వరద ప్రవహాం

By

Published : Aug 8, 2020, 1:42 PM IST

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 1.99 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 848 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 75.9734 టీఎంసీలుగా నమోదైంది.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ .. 42,108 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 1301 క్యూసెక్కులు, హంద్రీనీవా కు 1589 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీచూడండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details