సచివాలయం కూల్చివేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్డీకపూల్ ప్రాంతంలో వాహనాలు భారీ స్థాయిలో స్తంభించిపోయాయి. దీనితో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు.
ట్రాఫిక ఆంక్షలతో వాహనదారుల ఇక్కట్లు.. పోలీసుల అవస్థలు - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఎటు పోవాలన్నా లకిడికపూల్నే ప్రధాన మార్గం. అన్నిదారులు ప్రస్తుతం లక్డీకపూల్ మీదుగా వెళుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సచివాలయం కూల్టివేత.. లక్డీకపూల్లో భారీగా ట్రాఫిక్ జామ్
సచివాలయం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించడంతో.. అటుగా వెళ్ళే వాహనదారులను అసెంబ్లీ మీదుగా పోలీసులు మళ్లించారు. లక్డీకపూల్, ఖైరతాబాద్, అసెంబ్లీ, లిబర్టీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముందే సమాచారం అందిస్తే ఈ అవస్థలు ఉండవు కదా.. అంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండీ:హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు... ఆ దారుల్లో వాహన రాకపోకలకు నో!