హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మియాపూర్, మదీన గూడ, కూకట్ పల్లి, బాచుపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో మోస్తరు నుంచి కుండపోత వాన కురిసింది. మియాపూర్లో సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో.. కాలనీలు ప్రధాన రహదారులు, ముంబై జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. కాలనీ అంతర్గత రోడ్లు వాగులను తలపించాయి. కాలనీలోకి వెళ్లేందుకు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదీన గూడలోని పలు అపార్ట్మెంట్ సెల్లార్లు వరద నీటిలో మునిగిపోయాయి.
హైదరాబాద్లో భారీవర్షం.. ముంబై జాతీయరహదారిపై ట్రాఫిక్ జాం - హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీవర్షం
హైదరాబాద్లో మరో భారీవర్షం కురిసింది. మియాపూర్, కూకట్ పల్లి పరిసరాల్లో కురిసిన ఈ వానతో కాలనీ రహదారులు నిండిపోయాయి. సెల్లార్లలోకి నీరు రావడంతో పలుచోట్ల అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్లో భారీవర్షం.. ముంబై జాతీయరహదారిపై ట్రాఫిక్ జాం
TAGGED:
హైదరాబాద్లో మరో భారీవర్షం