లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో... రహదారులపైకి వాహనదారుల రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లోఅధిక సంఖ్యలో నగరవాసులు రోడ్లపైకి వస్తున్నారు. రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు... కూడళ్ల వద్ద సిగ్నళ్లను అందుబాటులోకి తెచ్చారు. పైవంతెనల ద్వారా వాహనాల రాకపోకలకు అనుమతించారు.
లాక్‌డౌన్ సడలింపులు... రోడ్లపై భారీగా వాహనాలు - లాక్‌డౌన్ సడలింపులు
లాక్‌డౌన్ సడలింపుల వల్ల హైదరాబాద్లోని రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రభుత్వం సడలింపు ఇచ్చినవారు కాకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే అధికారులు జరిమానా విధిస్తున్నారు.
రవాణా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా... భవన నిర్మాణ కూలీలు, ఆయా విభాగాల ఉద్యోగులు, కార్యాలయాలు, ఇతర పనుల కోసం బయటకి వస్తున్నారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చినవారు కాకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే అధికారులు జరిమానా విధిస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో దాదాపు 15లక్షల వాహనాలు రోడ్లపైకి రాగా.. లాక్‌డౌన్ సమయంలో కేవలం లక్ష వాహనాలే బయటకి వచ్చాయి. ప్రస్తుత సడలింపుల వల్ల ఆ సంఖ్య ఐదారు లక్షలకు చేరింది.
ఇవీ చూడండి:ఏపీలో 2018కి చేరిన కరోనా కేసుల సంఖ్య