లాక్‌డౌన్ సడలింపు సమయంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రోజురోజుకీ పెరుగుతోంది. సడలింపు సమయాన్ని ప్రభుత్వం 3 గంటలు పెంచడంతో వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వారితో రద్దీ ఏర్పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, తెలంగాణ భవన్ ప్రాంతాల్లో వాహనదారులతో ప్రధాన రహదారులపై విపరీతమైన రద్దీ ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. రద్దీతో అంబులెన్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Lockdown effect: భాగ్యనగరంలో భారీ ట్రాఫిక్.. ఆ సమయంలో వాహనాల రద్దీ.!
హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. లాక్‌డౌన్ సడలింపు సమయంలో వాహనాలు కిక్కిరిసి పోతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రావడంతో రాకపోకలు పెరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు కూడళ్ల వద్ద భారీగా వాహన రాకపోకలు స్తంభిస్తున్నాయి. అధికారులు అదనపు ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పలు చోట్ల అంబులెన్స్‌లు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోతున్నాయి.
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతుండటంతో.. వివిధ కార్యాలయాలు, బ్యాంకుల సిబ్బంది ఇళ్లకు చేరేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో సాధారణ రోజులకంటే 20 శాతం వాహనాల సంఖ్య పెరిగిందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి:Paddy In Water:ఎడతెరిపి లేని వర్షం... తడిసి ముద్దవుతున్న ధాన్యం