యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నాగారం, లోతుకుంట, నర్సయ్య గూడెం, జంగారెడ్డి పల్లి, ఎం.తుర్కపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో పడిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. పట్టాలు అందుబాటులో లేక ధాన్యం రాసులు కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీరు నిల్వడం వల్ల వడ్ల బస్తాలు నీట మునిగాయి.
వలిగొండ మండలంలో అకాల వర్షం - నర్సయ్య గూడెం ఎం.తుర్కపల్లి ఈదురుగాలులతో వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మరికొన్నిచోట్ల ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపడ్డాయి.
అకాల వర్షం... నీట మునిగిన ధాన్యం బస్తాలుట
ఈదురుగాలులకు నర్సయ్య గూడెం గ్రామంలో ఎస్‌టీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ పత్తి కంపెనీ రేకుల షెడ్ కూలిపోయింది. ఎం.తుర్కపల్లి గ్రామంలో కోళ్ల ఫారం షెడ్ నెలకొరిగింది. మామిడి కాయలు రాలిపోవడం వల్ల అన్నదాత కంటతడి పెట్టుకుంటున్నారు. మరికొన్నిచోట్ల చెట్లు విరిగి పడగ రేకుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'