ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడమే కాకుండా వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
'ఈ ఏడాది 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి' - Heavy Temperatures in Telangana today news
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం లేకపోవడం వల్లే గాలిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి రాష్ట్రంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సాధారణం కన్నా రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది.
Heavy Temperatures in Telangana latest news