ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. గుంపులుగా ఎవరూ గుమిగూడ వద్దని పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటికే మద్యం దుకాణాలు, బార్‌లను మూసివేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
రంగారెడ్డి జిల్లాలో 199, మేడ్చల్లో 198, హైదరాబాద్ జిల్లాలో 191 పోలింగ్ కేంద్రాలతో పాటు... నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మరికొన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి:ఆ స్కెచ్పెన్తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ