హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్ కిటకిటలాడింది. ఆదివారం కావడం వల్ల కూరగాయలు, ఇతర వంట సరుకుల కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. సమీప ప్రాంత ప్రజలంతా ఉదయం 6 గంటల నుంచే మాదన్నపేట మార్కెట్ బాటపట్టారు.
ప్రజలతో కిటకిటలాడిన మాదన్నపేట్ మార్కెట్ - తెలంగాణ వార్తలు
లాక్ డౌన్ సడలింపు సమయంలో పాతబస్తీలోని మాదన్నపేట్ మార్కెట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడం వల్ల కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలు కోసం జనాలు పెద్దఎత్తున మార్కెట్‌కు తరలివచ్చారు.

market
మాస్కులు ధరించినప్పటికీ భౌతిక దూరం పాటించకుండానే గుమిగూడారు. కొనుగోలుదారులతో కూరగాయల మార్కెట్ కిక్కిరిసిపోయింది. సరూర్ నగర్ పోలీసులు కర్మన్ ఘట్లో చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు నిర్వహించారు.