బతుకమ్మ, దసరా పండుగలకు ఊర్లకు పయనమైన జనాలతో ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్.ఎం వరప్రసాద్ పేర్కొన్నారు. గత ఏడాది 4,900 బస్సులు నడిపితే ఈ ఏడాది 33 బస్సులు అదనంగా నడుపుతున్నామన్నారు. 4వ తేదీ నుంచి 7 వరకు అత్యధికంగా 3,236 బస్సులను నడుపుతున్నామన్నారు. 4న 749 బస్సులు, 5న 964 బస్సులు, 6న 712 బస్సులు, 7, 8 తేదీల్లో 72 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిలో ఏపీకి 964 బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ నెల 5 నుంచి కార్మికసంఘాలు సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన దృష్ట్యా... ముందస్తు ప్రయాణాలు పెట్టుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
ముందస్తు ప్రయాణాలతో కిటకిటలాడుతోన్న బస్టాండ్లు - rtc samme effect
ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నోటీసుల నేపథ్యంలో అయోమయంలో పడిన ప్రజలు... ముందస్తు ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ముందుగానే ఊర్లకు పయనమవటం వల్ల ప్రధాన ప్రయాణ ప్రాంగాణాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

HEAVY RUSH IN HYDERABAD BUSTATNDS BECAUSE RTC SAMME EFFECT
ముందస్తు ప్రయాణాలతో కిటకిటలాడుతోన్న బస్టాండ్లు
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె
Last Updated : Oct 4, 2019, 8:46 AM IST