కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద జనం బారులు తీరారు. ఈ నెల 12 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోకుండానే వ్యాక్సిన్ ఇస్తుండడం వల్ల అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఫలితంగా కోఠి ఈసామియా బజార్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రద్దీ నెలకొంది.
కోఠి ఆరోగ్య కేంద్రానికి పోటెత్తిన జనం.. పోలీసుల జోక్యం! - తెలంగాణ వార్తలు
కొవిడ్ మహమ్మారి రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల జనం అప్రమత్తమయ్యారు. రెండో డోసు వ్యాక్సిన్ కోసం ఆరోగ్య కేంద్రాలకు పోటెత్తుతున్నారు. కోఠి ఆరోగ్యం కేంద్రంలో రద్దీ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
వ్యాక్సిన్ కోసం జనం బారులు, కోఠి ఆరోగ్యం కేంద్రంలో జనం బారులు
ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. జనం పోటెత్తడం వల్ల పోలీసులు వచ్చి కరోనా నిబంధనలు అమలు పరుస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి