తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రకటనతో వైన్​షాప్​ల వద్ద రద్దీ

ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించగానే హైదరాబాద్​లో హడావుడి మొదలైంది. కరోనా నిబధనలు ఉల్లంఘిస్తూ... మద్యం కోసం వైన్ షాప్​ల ఎదుట క్యూలు కట్టారు.

hyderabad people quee infront of wine shops
లాక్​డౌన్​ ప్రకటనతో వైన్​షాప్​ల వద్ద రద్దీ

By

Published : May 11, 2021, 9:51 PM IST

ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించగానే హైదరాబాద్​లో మందుబాబులు అప్రమత్తమయ్యారు. తమకు దగ్గరలో ఉన్న వైన్ షాపుల వద్ద బారులు తీరారు. రేపటి నుంచి మందు దొరుకుతుందో దొరకదోననే ఆత్రుతతో కరోనా నిబంధనలు పాటించకుండానే మందు ప్రియులు ఎగబడిపోయారు.

హైదరాబాద్ పాతబస్తీ, శంషీర్ గంజ్, ఛత్రినాక, ఉప్పుగూడా, చంద్రాయణగుట్ట, కేశవగిరి ప్రాంతాల్లోని అన్ని వైన్ షాప్​ల వద్ద ఇదే పరిస్థితి. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్​లు, మాంసం దుకాణాల ఎదుట కూడా జనాలు పెరిగిపోయారు.

ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు

ABOUT THE AUTHOR

...view details