తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరం పల్లె బాట... కిక్కిరిసిపోయిన ప్రయాణ ప్రాంగణాలు

సంక్రాంతి పండుగకు భాగ్యనగరం ఊరెళ్తోంది. ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ కిటకిటలాడుతోంది. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా... బెర్తులు దొరకక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

heavy rush at secundrabad railway station
ఊరెళ్తోన్న భాగ్యనగరం... కిక్కిరిసిపోయిన ప్రయాణ ప్రాంగణాలు

By

Published : Jan 13, 2020, 2:49 PM IST

సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. నగరం నుంచి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం ప్రాంతాలకు వెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. రైలు ఎక్కేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు, తొక్కిసలాటలు జరుగకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బోగీల వద్దే నిల్చొని క్రమ పద్ధతిలో ఎక్కిస్తున్నారు.

రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు, రెగ్యులర్ ట్రైన్స్ గోదావరి, విశాఖ, ఫలకనుమా, చెన్నై, ఛార్మినార్, సింహపురి, మచిలీపట్నం, నర్సాపూర్, గౌతమితో పాటు ప్రత్యేక రైళ్లు కూడా ఫుల్​గా వెళ్తున్నాయి.

బస్టాండ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతాదుకు మించి ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఊరెళ్తోన్న భాగ్యనగరం... కిక్కిరిసిపోయిన ప్రయాణ ప్రాంగణాలు

ABOUT THE AUTHOR

...view details