తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్​ను బేఖాతరు చేస్తున్న జనం - హైదరాబాద్‌ మార్కెట్లు జనం రద్దీ

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను జనం బేఖాతరు చేస్తూ ఆదివారం పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. కూరగాయల మార్కెట్లలో భౌతికదూరం పాటించకుండా సమూహాలుగా క్రయవిక్రయాలు జరిపారు.

లాక్‌డౌన్‌ బేఖాతరు చేస్తున్న జనం
లాక్‌డౌన్‌ బేఖాతరు చేస్తున్న జనం

By

Published : Apr 19, 2020, 4:45 PM IST

నిత్యావసర సరుకులు కొనేందుకు ఒక్కరే బయటకు రావాలన్న ప్రభుత్వ ఆదేశాలను హైదరాబాద్‌ ప్రజలు పట్టించుకోవడం లేదు. కూరగాయల మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. జీడీమెట్ల, సూరారం కాలనీ ప్రాంతాల్లో మార్కెట్‌కు కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మార్కెట్​ మొత్తం జన సంద్రంగా మారింది. ముఖ్యంగా మాంసాహార దుకాణాల వద్ద ఏ మాత్రం భౌతిక దూరాన్ని పాటించలేదు. పోలీసులు వచ్చినప్పుడు మాత్రమే దూరంగా ఉంటూ... వారు వెళ్లిపోగానే యథాతథంగా ఒక్కచోట చేరారు.

ABOUT THE AUTHOR

...view details