తెలంగాణ

telangana

ETV Bharat / state

vaccination: టీకా​ కేంద్రానికి పోటెత్తిన జనం - తెలంగాణ వార్తలు

టీకా కోసం జనం వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం నుంచే లైన్లలో ఎదురుచూస్తున్నారు. గాజులరామారంలోని మహారాజా గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి 1500 మందికి పైగా వచ్చారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

gajularamaram vaccination center, heavy rush at vaccination
టీకా కేంద్రాల్లో రద్దీ, గాజులరామారం వ్యాక్సినేషన్ కేంద్రం

By

Published : Jun 9, 2021, 12:24 PM IST

హైదరాబాద్ గాజులరామారంలోని మహారాజా గార్డెన్స్ వాక్సినేషన్ కేంద్రంలో రద్దీ నెలకొంది. టీకా కోసం జనం ఎగబడ్డారు. గేటు వద్ద ఉన్న పోలీసులు వారిని నిలువరించలేకపోవడంతో లోపలికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సగం మందిని తిరిగి పంపించారు.

ఉదయం నుంచి క్యూ లైన్లలో ఎదురుచూస్తున్న తమని పంపించడం దారుణమని టీకా కోసం వచ్చిన జనం వాపోయారు. సుమారు 1500 మందికి పైగా తరలివచ్చారు.

ఇదీ చదవండి:Inter exams: ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు

ABOUT THE AUTHOR

...view details