తెలంగాణ

telangana

ETV Bharat / state

మాంసం దుకాణాల్లో కిటకిట! - తెలంగాణ వార్తలు

ఓవైపు కరోనా విజృంభణ... మరోవైపు చల్లని వాతావరణం... ఇంకేముంది ముక్క కోసం జనం రోడ్ల మీదకు వచ్చారు. మాంసం దుకాణాల వద్ద బారులు తీరారు. హైదరాబాద్​లోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

heavy rush at chicken shop, heavy rush at mutton shop
మాంసం దుకాణాల వద్ద జనం బారులు, మాంసం దుకాణాలు కిటకిట

By

Published : May 16, 2021, 12:22 PM IST

కరోనా వేళ ప్రజలకు ఆహారపు అలవాట్లపై స్పృహ పెరిగింది. రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మాంసం కోసం బారులు తీరారు. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, భోలక్​పూర్, కవాడిగూడ, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు కిటకిటలాడాయి.

లాక్​డౌన్ మినహాయింపు సమయంలో దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో వరుసలో నిలబడ్డారు. కరోనా నిబంధనలు విస్మరించారు.

ఇదీ చదవండి:'హ్యాపీనెస్ కిట్'తో నెలసరి సమస్యలకు పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details