మృగశిర కార్తె సందర్భంగా చేపలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివచ్చారు. భౌతిక దూరం పాటించకుండా కొనుగోలుదారులు ఎగబడ్డారు. బేగంబజార్ చేపల మార్కెట్ వద్ద రద్దీ నెలకొంది.
మృగశిర: బేగంబజార్ చేపల మార్కెట్లో కిటకిట - తెలంగాణ వార్తలు
మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. బేగంబజార్ చేపల మార్కెట్లో రద్దీ నెలకొంది. భౌతిక దూరం పాటించకుండా చేపలు కొనుగోలు చేశారు.
బేగం బజార్ చేపల మార్కెట్, హైదరాబాద్
మృగశిర రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని... స్థానికులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచే చేపల మార్కెట్లు కిటకిటలాడాయి.