రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడనంతోపాటు దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు ఉత్తర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు 104 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు - వాతావరణ శాఖాధికారి
రాజస్థాన్ ఆగ్నేయ, తమిళనాడు ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఇవాళ, రేపు భారీ వర్షాలు