ఏపీ విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో ఓంకారం మలుపు వద్ద రాళ్లు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. ఉదయం పది గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. వర్షాలు కురుస్తుండటం వల్ల భక్తులెవ్వరినీ ఘాట్ రోడ్ నుంచి అనుమతించలేదని.. దీనితో ప్రాణ నష్టం తప్పిందని స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు
ఏపీ కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. జేసీబీలతో అధికారులు బండరాళ్లను తొలగించారు.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు
ఘాట్‌రోడ్‌లో దసరా ఉత్సవాల నేపథ్యంలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కారణంగా పనులు కూడా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. ఘాట్ రోడ్‌పై పడిన కొండ చరియలను జేసీబీలతో తొలగించారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు