RAINS IN TIRUPATI : తుపాన్ ప్రభావంతో ఏపీలోని తిరుపతి అస్తవ్యస్థంగా మారింది. వర్షాల ప్రభావంతో శ్రీవారి మెట్టుమార్గాన్ని టీటీడీ మూసేసింది. మెట్లపై నీరు ప్రవహిస్తుండంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. భక్తుల రాకపోకలను నియంత్రించింది. శ్రీవారిమెట్టు మార్గంలోని.. 450వ మెట్టు వద్ద వరద పోటెత్తుతోంది. తుపాను ఉధృతి తగ్గిన అనంతరం తిరిగి యథావిధిగా నడక మార్గంలో భక్తులు వెళ్లొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
తుపాన్ ఎఫెక్ట్.. తిరుమలలో భారీ వర్షం.. శ్రీవారి మెట్టు మార్గం మూసివేత
RAINS IN TIRUPATI: మాండౌస్ తుపాన్ కారణంగా ఏపీలోని తిరుపతి జిల్లా అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాన్ ప్రభావంతో మెట్ల మార్గాన్ని టీటీడీ మూసేసింది.
తిరుమల
భారీ వృక్షం కూలి భక్తురాలికి గాయాలు: మాండౌస్ తుపాను ప్రభావంతో తిరుమలో కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షం కూలి భక్తురాలికి గాయాలయ్యాయి. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు ఉన్న రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన మహిళను ఆస్పత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: