రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Weather report: రాగల 3 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - heavy rains in telangana news
రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
సముద్రమట్టానికి 1.5 కిమీ నుంచి 5.8కిమీ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని.. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది పశ్చిమ వైపుకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఈ రోజు ద్రోణి ఉత్తర ఇంటీరియర్.. కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1కిమీ వరకు వ్యాపించి ఉందని సంచాలకులు తెలిపారు.
ఇదీ చదవండి:CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం