రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న గాంగేటిక్ పశ్చిమ బంగ ప్రాంతంలో 2.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తు ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.
ఆ జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ వర్షాలు - Huge Rains In Telanagana Latest News
రాగల మూడు రోజులూ రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.

వచ్చే మూడు రోజులూ ఆ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
మంగళ, బుధవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవీ చూడండి : 'తెలంగాణలో కరోనా బాధితుల్లో 85 శాతం మందికి లక్షణాలే లేవు'