రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా హాజీపూర్(మంచిర్యాల జిల్లా)లో 21.3 సెంటీమీటర్లు కురిసింది. మొత్తం 18 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. గత పదేళ్లలో జులై నెలలో ఒకరోజు(24 గంటల్లో) కురిసిన అత్యధిక వర్షం 2013, జులై 19న హాజీపూర్‌లో 17.7 సెం.మీ.లుగా వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది. అక్కడ మంగళవారం రాత్రి (12 గంటల వ్యవధిలో) ఇంతకన్నా ఎక్కువ వర్షం కురవడంతో కొత్త రికార్డు 21.3 సెం.మీ.లుగా నమోదైంది. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో 8.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గ్రేటర్ కార్పొరేషన్ అప్రమత్తత ప్రకటించింది.
అత్యధికంగా వర్షం కురిసిన ప్రాంతాలు