ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్ 3నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఛత్తీ్‌స్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణమధ్య కర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.
రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే 24 గంటల్లో తుఫాను వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్ కేసులు... ఐదుగురు మృతి